గ్యాస్, ఉబ్బరం సమస్యలను క్షణాల్లో మాయం చేసే బెస్ట్ స్పైసెస్ ఇవే!

మనం తరచూ ఎదుర్కొనే కామన్ సమస్యల్లో గ్యాస్, ఉబ్బరం( Gas Bloating ) వంటివి ముందు వరుసలో ఉంటాయి.

కొందరైతే నిత్యం ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే ఏం తినాలన్నా భయపడుతుంటారు.

అలాగే గ్యాస్, ఉబ్బరం సమస్యను వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే స్పైసెస్ అద్భుతంగా సహాయపడతాయి.ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది నల్ల మిరియాలు.

వన్ టేబుల్ స్పూన్ తేనెలో పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.

ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని సేవించాలి.ఈ విధంగా చేయడం వల్ల గ్యాస్ సమస్య దెబ్బ‌కు ఎగిరిపోతుంది.

కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. """/" / అలాగే అసౌకర్యమైన మరియు కష్టమైనా జీర్ణ లక్షణాలను ధనియాల సహాయంతో తగ్గించుకోవచ్చు.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని( Coriander Powder ) కలిపి తీసుకోవాలి.

లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ధ‌నియాల‌ను బాగా న‌మిలి మింగి వాట‌ర్ తాగాలి.

ఇలా చేస్తే క్షణాల్లో గ్యాస్, ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయి.దాల్చిన చెక్క.

ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే స్పైసెస్ లో ఒకటి.ఆరోగ్యపరంగా దాల్చిన చెక్క అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.

ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి వంటి వాటితో బాధపడేవారు రోజూ ఒక కప్పు దాల్చిన చెక్క టీ తాగితే ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

పైగా దాల్చిన చెక్క టీ( Cinnamon Tea ) వెయిట్ లాస్ ను కూడా ప్ర‌మోట్ చేస్తుంది.

"""/" / ఇక గ్యాస్ బాగా ప‌ట్టేసినా, క‌డుపు ఉబ్బరంగా అనిపించినా.వెంట‌నే వ‌న్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వ‌న్ టేబుల్ స్పూన్ సోంపు కలిపి ఒక గ్లాస్ వాటర్ లో మ‌రిగించి తీసుకోండి.

ఇలా చేసినా కూడా మంచి ఉపశమనం ఉంటుంది.జీల‌క‌ర్ర‌, సోంపు.

ఇవి రెండు ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి.జీర్ణక్రియ పనితీరును పెంచుతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలన్నిటికీ చెక్ పెడతాయి.

హెయిర్ ఫాల్ వెంటనే స్టాప్ అవ్వాలా.. అయితే ఇలా చేయండి!