ఈ నెలలో రూ.10వేల లోపు కొనగలిగే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే…

ఈ నెలలో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం చాలా అద్భుతమైన ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.

మీ బడ్జెట్ పదివేల లోపే అయితే ఆ తక్కువ ధరకే అనేక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌లు అదిరిపోయే డిస్‌ప్లేలు, లేటెస్ట్ ప్రాసెసర్లు, కనీసం 3GB RAM ఆఫర్ చేస్తున్నాయి.

అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.• పోకో C55 (4GB RAM, 64GB స్టోరేజ్): అమెజాన్‌లో పోకో C55 ఫోన్( Poco C55 Phone ) రూ.

8,443కే లభిస్తోంది.ఇది 5,000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది.

ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో నడుస్తుంది.4GB ర్యామ్, 64GB స్టోరేజ్ గల ఇది 6.

71-అంగుళాల HD+ డిస్‌ప్లే ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇందులో సినిమాలు ఎంచక్కా చూసుకోవచ్చు.

"""/" / • రియల్‌మీ C33 (3GB RAM, 32GB స్టోరేజ్): ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.

8,936 ఉంది.ఇది 50MP మెయిన్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది.

ఇది Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.

2-అంగుళాల HD+ డిస్‌ప్లే గల ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ఫుల్ డే బ్యాకప్ అందిస్తుంది.

"""/" / • ఇన్‌ఫినిక్స్‌ HOT 30i (4GB RAM, 64GB స్టోరేజ్): ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.

7,999కే దొరుకుతుంది.ఇది 50MP ప్రైమరీ కెమెరాను అందిస్తుంది.

ఇది మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కూడా అందించారు.

10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ఇది వస్తుంది. """/" / • రెడ్‌మీ 9 (4GB RAM, 64GB స్టోరేజ్): అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.

9,499గా ఉంది.ఇది 60Hz ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.13MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది.

"""/" / • రియల్‌మీ నార్జో N53 (4GB RAM, 64GB స్టోరేజ్): ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ.

8,999కి సొంతం చేసుకోవచ్చు.ఇది 5,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లేతో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

మార్కెట్‌లో అత్యంత చవకైన 5G సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి.

ఇది 50MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

ఇది Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?