వ‌ర్షాకాలంలో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే బెస్ట్ ఆయిల్స్ ఇవే!

హెయిర్ ఫాల్‌.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య ఇది.

అందులోనూ ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో హెయిర్ ఫాల్ మ‌రింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.వాతావ‌రణంలో వ‌చ్చే మార్పులు, వ‌ర్షాల్లో త‌ర‌చూ త‌డ‌వ‌టం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతూ ఉంటుంది.

దాంతో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఇరుగు పొరుగు వారు చెప్పిన హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు త‌ర‌చూ ట్రై చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్స్ వ‌ర్షాకాలంలో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.టీట్రీ ఆయిల్‌.

జుట్టు సంర‌క్ష‌ణ‌కు ఇది చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.హెయిర్ ఫాల్‌ను అడ్డుకునేందుకు టీట్రీ ఆయిల్‌ను యూస్ చేయ‌వ‌చ్చు.

అందుకోసం ఒక క‌ప్పు కొబ్బ‌రి పాల‌లో వ‌న్ టేబుల్ స్పూన్ టీట్రీ ఆయిల్‌ను మిక్స్ చేసి జుట్టు మొత్తానికి ప‌ట్టించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ క్రమంగా అదుపులోకి వ‌స్తుంది.అలాగే వ‌ర్షాకాలంలో హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టే ఆయిల్స్‌లో జోజోబా ఆయిల్ ఒక‌టి.

జోజోబా ఆయిల్ ను తల కుదుళ్లకు ప‌ట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి.

ఉద‌యాన్నే గాఢత తక్కువ గల షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

"""/" / ఇక హెయిర్ ఫాల్‌ను త‌గ్గించుకోవ‌డం కోసం ఆలివ్ ఆయిల్‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఒక క‌ప్పు అల్లం ర‌సంలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను యాడ్ చేసి జుట్టు కుదళ్లకు పట్టించాలి.

గంటయ్యాక తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి.

దాంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

Pallavi Prashanth : జైలు కూడు బాగుంది…నన్ను చూసిన ఖైదీలు అలా మాట్లాడేవారు: పల్లవి ప్రశాంత్