హెయిర్ ఫాల్‌తో బాధపడే పురుషులకు బెస్ట్ హెయిర్ ప్యాకులు ఇవే!
TeluguStop.com
హెయిర్ ఫాల్.స్త్రీలలోనే కాదు పురుషుల్లోనూ ఈ సమస్య అధికంగానే ఉంటుంది.
వయసు పైబడిన తర్వాత జుట్టు రాలినా పురుషులు పెద్దగా పట్టించుకోరు.కానీ, పెళ్లి కాకముందే వెంట్రుకలు రాలిపోతూ జుట్టు పల్చబడిపోతుంటే.
ఇక వారి బాధను వర్ణించలేమనే చెప్పాలి.ఈరోజుల్లో తల నిండా జుట్టు ఉంటేనే అబ్బాయిలను పిల్ల దొరకడం లేదు.
అదే జుట్టు లేకపోతే.ముఖంమే చూడరని పురుషులు గట్టిగా నమ్ముతారు.
అందుకే వివాహం అయ్యే వరకు జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జుట్టు రాలిపోతూనే ఉంటే.
ఏం చేయాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే బెస్ట్ హెయిర్ ప్యాకులను ట్రై చేస్తే హెయిర్ ఫాల్‌కి టాటా చెప్పొచ్చు.
మరి లేటెందుకు ఆ హెయిర్ ప్యాకులు ఏంటో చూసేయండి. """/"/
ముందుగా ఒక అవకాడో పండును తీసుకుని పై తొక్క, లోపల ఉన్న గింజను తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో ఒక ఫుల్ ఎగ్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట పాటు వదిలేయాలి.ఆపై మైల్డ్ షాంపూను యూస్ చేసి తలస్నానం చేయాలి.
ఇలా వారంలో ఒక్కసారి చేస్తే జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. """/"/
అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి, వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకల పొడి, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని కలుపుకోవాలి.
చివరిగా ఇందులో కొబ్బరి పాలను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని తలకు పట్టించాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.
పురుషులు తరచూ ఇలా చేసినా హెయిర్ ఫాల్ నుంచి బయటపడతారు.
ఒబేసిటీతో బాధపడుతున్న రష్యన్ పిల్లి.. బరువు తగ్గడానికి ఏం చేస్తుందో తెలిస్తే..?