Sleep : రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. అయితే మీ డైట్ లో ఈ పండ్లు ఉండాల్సిందే!
TeluguStop.com
ఆరోగ్యమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం, నిత్యం వ్యాయామం మాత్రమే సరిపోవు కంటి నిండా నిద్ర( Sleep ) కూడా ఎంతో అవసరం.
అయితే ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు.
కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.ఒత్తిడి పెరిగితే గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయి.
అలాగే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది.అందుకే కంటినిండా నిద్ర( Full Sleep ) ఉండేలా చూసుకోవాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు.
అయితే నిద్ర పట్టడానికి మందులే వాడాల్సిన అవసరం లేదు.కొన్ని కొన్ని ఆహారాలు నిద్రను అద్భుతంగా ప్రేరేపిస్తాయి.
అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే పండ్లు ముందు వరుసలో ఉంటాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పండ్లు ఏవేవో తెలుసుకుందాం పదండి.
"""/" /
కివీ పండ్లు( Kiwi Fruits ).ఖరీదు ఎక్కువైనప్పటికీ ఆరోగ్యపరంగా ఇవి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ఈ పండ్లలో విటమిన్ సి( Vitamin C ) మరియు సెరోటోనిన్ పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల కివీ పండ్లను డైట్ లో చేర్చుకుంటే నిద్రలేమి దూరమవుతుంది.ప్రశాంతంగా మీరు నిద్ర పోతారు.
అలాగే మంచి నిద్రను ప్రమోట్ చేసే ఫ్రూట్స్ లో పైనాపిల్ ఒకటి.పైనాపిల్( Pineapple ) లో ఉండే పోషకాలు మిమ్మల్ని త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.
మరియు నాణ్యమైన నిద్రను అందిస్తాయి. """/" /
రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడుతున్న వారు నిత్యం ఒక అరటి పండు( Banana )ను తీసుకోండి.
అరటిపండు అద్భుతమైన ఆరోగ్యకరమైన పండు.అరటిపండులో అనేక పోషకాలతో పాటు మెలటోనిన్ ఉంటుంది.
మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపించే హార్మోన్.దీనిని స్లీప్ హార్మోన్ అని కూడా పిలుస్తారు.
అందువల్ల అరటిపండును తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.ఇది హాయిగా నిద్ర పోవడానికి సహాయపడుతుంది.
అరటి పండ్ల మాదిరిగానే చెర్రీ పండ్లలో కూడా మెలటోనిన్ మెండుగా ఉంటుంది.ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే మీరు చెర్రీ పండ్లను కూడా ఆహారంతో భాగం చేసుకోండి.
ఇక రాత్రివేళ స్పైసి ఫుడ్స్ టమాటోలు, పిజ్జాలు, బర్గర్స్, చాక్లెట్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఎందుకంటే ఇవి మీ నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయి.తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తాయి.
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?