దంతాలను దృఢపరిచే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.. మీరు తింటున్నారా?
TeluguStop.com
నేటి ఆధునిక కాలంలో చాలా మంది దంతాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఉదయాన్నే బ్రష్ మీద పేస్ట్ వేసి తోమేయటం మినహా దంతాల విషయంలో ఎటు వంటి జాగ్రత్తలు తీసుకోరు.
ఫలితంగా దంతాలు బలహీనంగా మారడం, పుచ్చి పోవడం, ఏవైనా వేడి లేదా చల్లటి ఆహారాలు తీసుకున్నప్పుడు జివ్వుమనడం, తరచూ నొప్పి పుట్టడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
పైగా దంతాల ఆరోగ్యం దెబ్బ తింటే జీర్ణ వ్యవస్థి పని తీరు కూడా నమ్మదిస్తుంది.
అందుకే దంతాలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
"""/" /
అయితే అందుకు కొన్ని కొన్ని ఫ్రూట్స్ అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆలస్యం చేయకుండా దంతాలకు మేలు చేసే ఆ పండ్లు ఏంటో చూసేయండి.
అరటి పండు తక్కువ ధరకే లభించినప్పటికీ.బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా రోజూ ఒక అరటి పండు తీసుకుంటే.అందులో సమృద్ధింగా ఉంటే మెగ్నీషియం కంటెంట్ దంతాలను స్ట్రాంగ్‌గా మరియు హెల్తీగా మరుస్తుంది.
దంతక్షయాన్ని దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తుంది.అలాగే వండర్ ఫ్రూట్ అయిన కివి ఫ్రూట్ కూడా దంతాలను దృఢపరచగలదు.
కివి ఫ్రూట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ.రోజుకొక పండు తీసుకంటే గునక అందులో ఉండే పొషక విలువలు దంతాలతో పాటు చిగుళ్ల ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తాయి.
"""/" /
నారింజ పండ్లు సైతం దంతాలకు ఎంతో మేలు చేస్తాయి.నారింజలో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందు వల్ల, నారింజను తరచూ తీసుకుంటే పళ్ళు బలంగా మారడమే కాదు దంత సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
వీటితో పాటుగా అవకాడో, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామ వంటి పండ్లు కూడా దంతాలను దృఢంగా మార్చగలవు.
కాబట్టి, ఈ పండ్లు డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ?