ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ఫ్యాటీ లివ‌ర్‌.( Fatty Liver ) ఇటీవ‌ల కాలంలో ఎంతో మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డాన్నే ఫ్యాటీ లివ‌ర్ అంటారు.ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి.

ఒక‌టి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాగా.ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్( Alcoholic Fatty Liver Disease ) మ‌రొక‌టి.

మొద‌టిది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది.కొవ్వు ఎక్కువ‌గా ఉంటే ఆహారాలు తీసుకోవ‌డం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సంభవించవచ్చు.

రెండో రకమైన ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల వస్తుంది.

ఫ్యాటీ లివ‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు జీవ‌న‌శైలిలో ప‌లు మార్పులు చేసుకోవ‌డం ద్వారా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

మొద‌ట ఆహారంపై దృష్టి సారించాలి.పుష్కలంగా పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్‌లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

కొవ్వు, చక్కెర మరియు ఉప్పును పరిమితం చేయాలి.కాలేయ‌డంలోని కొవ్వును క‌రిగించ‌డానికి వెల్లుల్లి( Garlic ) చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల రోజూవారీ ఆహారంలో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బ‌లు ఉండేలా చూసుకోండి.

ఉద‌యం పూట తేనెలో నాన‌బెట్టిన వెల్లులిని తిన్నా చాలా మంచి ఫ‌లితం ఉంటుంది.

"""/" / అలాగే ఫ్యాటీ లివ‌ర్ తో బాధ‌ప‌డుతున్న వారికి గ్రీన్ టీ( Green Tea ) ఒక వ‌రమ‌ని చెప్పుకోవ‌చ్చు.

చెడు కొలెస్ట్రాల్ ను, కాలేయ‌డంలో కొవ్వును బ‌ర్న్ చేయ‌డానికి గ్రీన్ టీ తోడ్ప‌డుతుంది.

కాబ‌ట్టి రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ టీ ను త‌ప్ప‌క తీసుకోండి.అదే స‌మ‌యంలో చ‌క్కెర జోడించిన టీ, కాఫీలు తీసుకోవ‌డం మానుకోండి.

మిల్లెట్లు, క్వినోవా, ఓట్స్ మరియు బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి.

కాలేయ కొవ్వును కూడా క‌రిగిస్తాయి. """/" / బెర్రీలు, సిట్రస్ పండ్లు, యాపిల్స్, ఆకు కూరలు, బ్రోకలీ వంటి వివిధ రకాల పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అందువ‌ల్ల ఇవి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఇక ఆరోగ్య‌క‌మైన ఆహారం తీసుకోవ‌డంతో పాటు నిత్యం అర‌గంట పాటు వ్యాయామం చేయాలి.

కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఫాస్ట్ ఫుడ్స్‌, ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎవైడ్ చేయాలి.

మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకోండి.శ‌రీర బ‌రువును, షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోండి.

తద్వారా ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌తారు.కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

‘ కారు ‘ పార్టీకి రిపేర్లు గట్టిగానే చేస్తున్నారా ?