నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ న్యాచుర‌ల్ క్రీమ్ రాస్తే మ‌స్తు బెనిఫిట్స్‌!

ముఖ సౌంద‌ర్యాన్ని పెంపొందించుకునేందుకు మార్కెట్‌లో దొరికే క్రీములెన్నిటినో కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, వీటిల్లో ఉండే ప‌లు కెమిక‌ల్స్ చ‌ర్మానికి ప్ర‌యోజ‌నాల కంటే న‌ష్టాల‌నే ఎక్కువ తెచ్చిపెడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను రోజూ నైట్ నిద్రించే ముందు ముఖానికి రాసుకుంటే గ‌నుక మ‌స్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఆ న్యాచుర‌ల్ క్రీమ్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.

? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా ప‌ది పొట్టు తీసిన బాదం ప‌ప్పులు, ఐదు వాల్ న‌ట్స్‌ తీసుకుని మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ బాదం, వాల్‌న‌ట్‌ పొడిని జ‌ల్లించుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.అలాగే మ‌రోవైపు ఒక క్యారెట్ తీసుకున్ని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ క్యారెట్ ముక్క‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సాన్ని మాత్రం వేరు చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్‌ స్పూన్‌ బాదం-వాల్‌న‌ట్ పౌడ‌ర్‌, మూడు టేబుల్ స్పూన్ల‌ అలోవెర జెల్‌, మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్ వేసి ప‌ది నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే.

క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్‌లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే.

ప‌ది రోజ‌ల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు. """/"/ రాత్రి నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని.

ఆపై త‌యారు చేసుకున్న క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక ముఖ చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు తొల‌గిపోతాయి.మ‌రియు ముఖ చ‌ర్మం పొడి బార‌కుండా కూడా ఉంటుంది.

కేంద్రాన్ని ఒప్పించిన బాబు … అమరావతికి మహర్దశ