కోకోనట్ షుగర్ లో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ ఇవే..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే పంచదార ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రుచికి తీయగా ఉన్నా కానీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల గురించి ఊహిస్తే చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.
అందుకే పంచదారను చాలా తక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
పంచదారను ఎక్కువగా తీసుకుంటే టైప్ టు డయాబెటిస్, బరువు పెరగడం, కీళ్ళా ,మోకాళ్ళ నొప్పులు( Knee Pain ) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే ఆరోగ్యపరంగా ఎంతో మంచిదని చెబుతున్నారు.ఈ క్రమంలోనే కోకోనట్ షుగర్ ( Coconut Sugar )వెలుగులోకి వచ్చింది.
అలాగే చాలామందికి ఈ కోకోనట్ షుగర్ గురించి తెలియదు.కోకోనట్ షుగర్ తో డ్రింక్స్ ను తయారు చేస్తూ ఉంటారు.
ఇది కూడా సాధారణ పంచదార లాగానే తీయగా ఉంటుంది.కానీ ఇది ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యదు.
మరి ఈ కోకోనట్ షుగర్ లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోకోనట్ షుగర్ లో కొబ్బరిలో ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. """/" / ఇందులో ఐరన్, క్యాల్షియం, జింక్, పొటాషియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.న్యూట్రియంట్ లతో నిండి ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించదు.
ఇంకా చెప్పాలంటే పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ లో గ్లైసేమిక్స్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే డయాబెటిస్ ( Diabetes )ఉన్నవారు కూడా దీన్ని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.
ఇది తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. """/" / ఈ కోకోనట్ షుగర్ తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నవారికి ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా కోకోనట్ షుగర్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే కోకోనట్ షుగర్ లో కూడా ఎంతో కొంత స్వీట్ నెస్ అనేది ఉంటుంది.
కాబట్టి ఎక్కువ మోతాదులో అసలు తీసుకోకూడదు.దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు.
భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!