ఓపెన్ పోర్స్ ను పూర్తిగా తగ్గించే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాలు ఇవే!

ఓపెన్ పోర్స్‌.చ‌ర్మత‌త్వాల‌తో ప‌ని లేకుండా కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెట్టే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

చర్మం మీద స్వేద గ్రంధులు తెరుచుకుని ఉండ‌టాన్నే ఓపెన్ పోర్స్ అని అంటారు.

దీని వ‌ల్ల తెరుచుకుని ఉన్న స్వేద గ్రంధులలోకి దుమ్ము, ధూళి, చెమ‌ట‌, మురికి చేరుకుంటాయి.

ఫ‌లితంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాలను ట్రై చేస్తే ఓపెన్ పోర్స్ ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఈ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ఓపెన్ పోర్స్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అయ్యే వారు బాగా పండిన ఒక ట‌మాటోను తీసుకొని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ట‌మాటో ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడీ ట‌మాటో ప్యూరీలో వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్ వేసుకుని మిక్స్ చేసి.

ఆపై ఐస్ ట్రేలో ఆ మిశ్ర‌మాన్ని నింపాలి.నాలుగైదు గంట‌ల పాటు ఐస్ ట్రేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ త‌యారు అవుతాయి.

ఆ ఐస్ క్యూబ్స్‌తో రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు ముఖాన్ని రుద్దుకుంటూ ఉండాలి.

ఇలా చేస్తే ఓపెన్ పోర్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి. """/"/ అలాగే మ‌రో రెమెడీ ఏంటంటే.

ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, రెండు టేబుల్ స్పూన్ల‌ పుదీనా జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేయాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ రెమెడీని పాటించినా ఓపెన్ పోర్స్ స‌మ‌స్య నుండి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను..!