ఆరోగ్యానికి మంచిద‌ని.. ఇవి అతిగా తీసుకుంటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం.ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా, ప్రశాంత‌గా ఉండ‌గ‌లురు.

అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ప్ర‌తి రోజు వ్యాయామాలు చేస్తుంటారు.

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు తీసుకుంటారు.ఇలా చేయ‌డం మంచిదే.

అలా అని అతి మాత్రం చేయ‌రాదు.ఎందుకంటే, ఏ విష‌యంలో అయినా లిమిట్‌గా ఉంటేనే.

అది మ‌న‌కు మంచిది.అలా కాకుండా అతి చేస్తే మొద‌టికే మోసం జ‌రుగుతుంది.

ముఖ్యంగా కొంద‌రు బ‌రువు త‌గ్గేందుకో లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల గంట‌లు త‌ర‌బ‌డి వ్యాయామాలు చేస్తుంటారు.

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ అతిగా చేస్తే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, గుండె వేగం పెర‌గ‌డం, ప‌నిపై ఏకాగ్ర‌త త‌గ్గ‌డం, డీహైడ్రేషన్ వంటివి స‌మ‌స్య‌లు త‌ల్లెత్తుతాయి.

ఇక వ్యాయామ‌మే కాదు.కొన్ని కొన్ని ఆహారాల‌ను కూడా అతిగా తీసుకోరాదు.

అలాంటి వాటిలో గ్రీన్ టీ ఒక‌టి.నేటి కాలంలో చాలా మంది గ్రీన్ టీని డైలీ డైట్‌లో చేర్చుకుంటున్నారు.

గ్రీన్ టీ ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా ఎంతో మేలు చేస్తుంది.కానీ, అదే గ్రీన్ టీను అతిగా తీసుకుంటే.

ఐర‌న్ లోపించి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌కు దారి తీస్తుంది. """/"/ అలాగే చాలా మంది ఆరోగ్యానికి మంచిది క‌దా అని చేప‌ల‌ను వారంలో నాలుగు, ఐదు సార్లు తింటారు.

కొంద‌రు ప్ర‌తి రోజు తింటారు.అయితే చేప‌ల‌ను అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు సంభవించి సూక్ష్మజీవులతో పోరాడే సామర్ధ్యం త‌గ్గిపోతోంది.

ఇక బోలెడ‌న్ని పోష‌కాలు దాగి ఉన్న పాలకూర మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

అదే అతిగా తీసుకుంటే.కీడ్నీలో రాళ్లు ఏర్ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది.

ఇవే కాదు.గుడ్డు, ట‌మాటాలు, ఆలివ్ ఆయిల్, సిట్ర‌స్ ఫ్రూట్స్‌, సోయాబీన్, క్యారెట్, వెల్లుల్లి, అల్లం ఇలా ఏ ఆహార‌మైనా అతిగా తీసుకుంటే.

ప్రయోజనాలు ఏమోగాని.అనర్థాల‌నే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన జగన్.. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలివే!