వర్షాకాలంలో ఈ పండ్లు తింటే..మీ ఆరోగ్యం ప‌దిలం!

వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.ఈ కాలంలో వ‌ర్షాలే కాదు.

చల్లదనం, తేమ కార‌ణంగా ర‌కర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు, విష జ్వ‌రాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

అందుకే ఈ కాలాన్ని రోగాల కాలం అని కూడా పిలుస్తుంటారు.ఇక వ‌ర్షాకాల‌మే అనుకుంటే.

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కూడా కోర‌లు చాచి కూర్చుంది.కాబ‌ట్టి, ఇలా విప‌త్క‌ర స‌మ‌యంలో ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

అందుకు కొన్ని కొన్ని పండ్లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్ని ర‌క్షించే ఆ పండ్లు ఏంటీ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ సీజ‌న్‌లో అయినా విరి విరిగా ల‌భించే అర‌టి పండ్లు.వ‌ర్షాకాలంలో తీంటే మరింత ఆరోగ్యం.

అవును, ఈ రైనీ సీజ‌న్‌లో రోజుకో అర‌టి పండును తీసుకుంటే.అందులో ఉండే ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి, రోగ నిరోధక శ‌క్తిని పెంచుతాయి.

జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లను దూరం చేస్తాయి.అలాగే వ‌ర్షాకాలంలో ఖ‌చ్చితంగా తినాల్సి పండ్ల‌లో ప్లమ్స్ కూడా ఉంటాయి.

ఈ పండ్ల‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే.అందువ‌ల్ల‌, వీటిని వ‌ర్షాకాలంలో తీసుకుంటే.

దగ్గు, జలుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రియు ఈ పండ్ల వ‌ల్ల చ‌ర్మం కోమ‌లంగా ఉంటుంది.

"""/"/ ఈ కాలంలో మాత్ర‌మే ల‌భించే అల్ల నేరేడు పండ్ల‌ను కూడా త‌ప్ప‌కుండా తిన్సాల్సిందే.

ఈ అల్ల నేరేడు పండ్ల తీసుకుంటే.ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌తో పాటు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

దాంతో ర‌కర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు, వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే దానిమ్మ‌, బొప్పాయి, చెర్రీస్, పియర్, పైనాపిల్‌ వంటి పండ్ల‌ను కూడా ఈ సీజ‌న్ లో తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ పండ్ల‌తో పాటు వర్షాకాలంలో కాచి, చల్లార్చి, వడగట్టిన నీళ్లు తాగాలి.

చ‌ల్ల‌టి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.వర్షాకాలంలో బయట దొరికే ఫుడ్ తీసుకోవడం మానుకోవాలి.

గ్రీన్ టీ, సూప్స్ వంటివి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.

మ్యాట్రిమోని మోసాలపై హెచ్చరిక చేసిన సజ్జనార్