రావణుడు.. రాముని చేతిలోనే కాదు వీరి చేతిలోనూ ఓడిపోయాడని మీకు తెలుసా?
TeluguStop.com
రామాయణం గురించి తెలిసిన ప్రతీఒక్కరికీ రామరావణ యుద్ధం గురించి తప్పక తెలిసేవుంటుంది.అయితే రావణాసురుడు కేవలం రాముని చేతిలోనే కాదు మరికొందరి చేతిలోనూ ఓటమి పాలయ్యాడు.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleవాలి చేతిలో.
/h3p
ఒకసారి రావణుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు.ఆ సమయంలో వాలి పూజలు చేస్తున్నాడు.
రావణుడు వాలిని యుద్ధానికి పిలుస్తూ పదేపదే సవాలు చేశాడు.వాలి చేస్తున్న పూజకు ఆటకం కలిగింది.
వాలి చాలా శక్తివంతమైనవాడు.అతను తెల్లవారుజామున నాలుగు మహాసముద్రాలను ప్రదక్షిణ చేసేవాడు.
ఈ విధంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు.వాలి సూర్యుడికి ప్రదక్షిణలు చేసి అర్ఘ్యం ఇచ్చే వరకు రావణునిని వాలి తన పక్కనే నిలువరింపజేశాడు.
రావణుడు ఎంత ప్రయత్నించినా, వాలి బారి నుంచి బయటపడలేకపోయాడు.పూజానంతరం వాలి రావణుని విడిచిపెట్టాడు.
"""/"/
H3 Class=subheader-styleఅర్జునుడి చేతిలో./h3p
అర్జునుడు వెయ్యి చేతులు కలిగి ఉన్నాడు.
అందుకే అతనికి సహస్త్రబాహు అని పేరు వచ్చింది.రావణుడు సహస్త్రబాహువుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు తన వేయి చేతులతో నర్మదా నది ప్రవాహాన్ని ఆపేశాడు.
సహస్త్రబాహుడు నర్మదా జలాన్ని సేకరించి దానిని రావణుని సైన్యంపై విడుదల చేశాడు ఫలితంగా రావణునితో పాటు అతని సైన్యం నర్మదా నదిలో కొట్టుకుపోయింది.
ఈ ఓటమి తరువాత రావణుడు మరోసారి సహస్త్రబాహుతో యుద్ధానికి వెళ్ళాడు.అప్పుడు సహస్త్రబాహుడు అతనిని బంధించి జైలులో పెట్టాడు.
"""/"/
H3 Class=subheader-styleశివుని చేతిలో./h3p
రావణుడు చాలా శక్తివంతుడు.
తన శక్తిని తలచుకుని ఎంతో గర్వించేవాడు.ఈ అహంకార మత్తులో శివుడిని ఓడించడానికి రావణుడు కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు.
రావణుడు.శివుడిని యుద్ధానికి దిగాలని సవాలు చేశాడు.
అయితే మహాదేవుడు ధ్యానంలో మునిగివున్నాడు.దీంతో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు.
అప్పుడు శివుడు కైలాస పర్వతం బరువును మరింత పెంచాడు.రావణుడు ఈ బరువును ఎత్తలేకపోయాడు.
అతని చేయి పర్వతం కింద ఉండిపోయింది.ఎన్ని ప్రయత్నాలు చేసినా రావణుడు అక్కడ నుంచి చేయి తీయలేకపోయాడు.
అప్పుడు రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ తాండవాన్ని పాడాడు.శివుడు చాలా సంతోషించి రావణుడిని విడిచిపెట్టాడు.
ఈ విధంగా విముక్తి పొందిన రావణుడు.శివుడిని తన గురువుగా చేసుకున్నాడు.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు నిద్ర సరిపోవట్లేదు బాసు!