మెగాస్టార్ చిరంజీవి సినిమాలనే రిజెక్ట్ చేసిన ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!
TeluguStop.com
సాధారణంగా చిరంజీవి( Chiranjeevi ) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చిరంజీవి సినిమాలను ఎంతో ఇష్టపడతారు.చిరంజీవి సినిమాలను రిజెక్ట్ చేయడం ద్వారా ఈ మధ్య కాలంలో ముగ్గురు సెలబ్రిటీలు వార్తల్లో నిలిచారు.
చిరంజీవి విశ్వంభర సినిమాలో( Vishwambhara Movie ) విజయశాంతి నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే విజయశాంతి వేర్వేరు కారణాల వల్ల చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేశారు.చిరంజీవి, విజయశాంతి( Vijayashanti ) కాంబోను చాలా కాలం తర్వాత చూడాలని భావించే అభిమానులకు నిరాశ ఎదురైంది.
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన మరో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సాయిపల్లవి పేరు సమాధానంగా వినిపిస్తుంది.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని ( Sai Pallavi ) సంప్రదించగా ఆమె ఆ సినిమా రీమేక్ సినిమా కావడంతో ఆ ఆఫర్ ను వదులుకున్నారు.
"""/" /
చిరంజీవి సినిమా స్ట్రెయిట్ సినిమా అయితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాయిపల్లవి సైతం క్లారిటీ ఇచ్చేశారు.
చిరంజీవి సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మరో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) కావడం గమనార్హం.
గాడ్ ఫాదర్ సినిమాకు డైరెక్టర్ గా, మరో సినిమాలో నటుడిగా పృథ్వీరాజ్ కు ఛాన్స్ వచ్చినా ఆయన మాత్రం వేర్వేరు కారాణాల వల్ల సినిమాలో నటించలేదు.
"""/" /
చిరంజీవి సినిమాను సిద్ధు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) కూడా రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదనే సంగతి తెలిసిందే.
చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయన తన ఎనర్జీ లెవెల్స్ తో ఆశ్చర్యపరుస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు.
చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సీనియర్ హీరోగా సైతం మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!