ఈ ఏడాది రాహువు కన్ను ఈ రాశుల వారిపై ఉంటుంది.. వీరు జాగ్రత్త!

సాధారణంగా మనం జీవితంపై రాశులు గ్రహాల ప్రభావం ఎంతగానో ఉంటుంది.ఇలా గ్రహాలు స్థానచలనాలను బట్టి మనకు అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది చెబుతుంటారు.

అయితే కొన్నిసార్లు కొందరి రాశులపై రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది.ఈ విధమైనటువంటి ప్రభావం ఉన్న వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

మరి ఈ నూతన సంవత్సరంలో రాహువు ప్రభావం ఏ రాశుల వారిపై అధికంగా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

మేషం: ఈ ఏడాది మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో లగ్నానికి ద్వితీయ రాశిలో ప్రవేశిస్తాడు.

ఈ క్రమంలోనే రాహువు ప్రభావం వల్ల వృత్తి జీవితంలో సమస్యలు, ధననష్టం కలుగుతుంది.

వృషభం: ఈ ఏడాది రాహువు ప్రభావం వృషభ రాశి వారిపై కూడా అధికంగా ఉంటుంది.

ఇలా రాహువు ప్రభావం ఉండటం వల్ల సంపాదించినది తిరిగి కోల్పోవాల్సిన పరిస్థితిలు ఉంటాయి.

  కనుక ఈ రాశివారు ఈ ఏడాదిలో ఏ విధమైనటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతో మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి రాహువు పదవ ఇంట్లోకి అంటే కర్మలోకి ప్రవేశిస్తుంది కనుక వీరు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ రాశి వారు విద్య ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారిపై రాహువు ప్రభావం ఉండటం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు.

ఈ రాశి వారు ఏదైనా ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగా పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇలా ఈ రాశుల వారిపై ఈ ఏడాది రాహువు ప్రభావం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు పురోహితులను అడిగి చేయడం మంచిది.

ఫుట్‌బాల్ మైదానాన్ని మింగేసిన సింక్ హోల్.. వీడియో వైరల్..