ఈ 6 రకాల ఆహారాలు డైట్ లో ఉంటే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
TeluguStop.com
బాన పొట్టతో బాధపడుతున్నారా.? ఎన్ని విధాలుగా ప్రయత్నించిన పొట్ట తగ్గడం లేదా.
? డోంట్ వర్రీ.పొట్టను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది తినడం మానేస్తారు.
కానీ అది పొరపాటు.నిజానికి బాన పొట్టను కరిగించడానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆరు రకాలు ఆహారాలు డైట్ లో ఉంటే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆరు రకాల ఆహారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
ఓట్స్( Oats ).వెయిట్ లాస్ కే కాదు బెల్లీ ఫ్యాట్ ను మాయం చేయడానికి కూడా అద్భుతంగా సహాయపడతాయి.
ముఖ్యంగా రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, పూరీ వంటి ఆహారాలు కాకుండా వోట్మిల్ ను తీసుకోండి.
ఇది మీ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.చిరుతిండ్ల పై మనసు మళ్లకుండా చేస్తుంది.
పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. """/" /
బాన పొట్ట( Belly Fat )ను నాజూగ్గా మార్చడానికి సహాయపడే ఆహారాల్లో బాదం ఒకటి.
రోజు ఉదయం ఎనిమిది నుంచి పది నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పును తీసుకోవాలి.
పొట్ట కొవ్వును కరిగించడానికి మాత్రమే కాదు బాదం శరీరానికి మరెన్నో పోషకాలను సైతం అందిస్తుంది.
బాన పొట్టతో బాధపడేవారు ఖచ్చితంగా రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తీసుకోండి.గుడ్డు సంపూర్ణ పోషకాహారం.
గుడ్డును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు పొందొచ్చు.అలాగే పొట్ట కొవ్వు కూడా కరుగుతుంది.
"""/" /
ఆలివ్ ఆయిల్( Olive Oil ).బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారికి బెస్ట్ ఆయిల్ గా చెప్పుకోవచ్చు.
అవును బాన పొట్టతో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ తో తయారు చేసిన వంటలను తీసుకుంటే చాలా మంచిది.
పొట్ట చాలా త్వరగా ఫ్లాట్ అవుతుంది.బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఆకుకూరలు కూడా అద్భుతంగా సహాయపడతాయి.
అందుకే నిత్యం ఏదో ఒక ఆకుకూర డైట్ లో ఉండేలా చూసుకోవాలి.ఫ్రూట్స్.
శరీరాన్ని హెల్తీ గా మారుస్తాయి.పొట్ట కొవ్వును కరిగిస్తాయి.
ముఖ్యంగా గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, అవకాడో, పియర్స్, దానిమ్మ వంటి పండ్లను డైట్ లో చేర్చుకుంటే పొట్ట తగ్గుతుంది.