ఈ ఐదు రకాల ఆహారాలు డైట్ లో ఉంటే ఐరన్ కొరత అన్న మాటే అనరు!
TeluguStop.com
ఐరన్ లోపం.ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఫేస్ చేసే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
ఐరన్ లోపం కారణంగా రక్తహీనత బారిన పడడమే కాదు సంతాన సమస్యలు తలెత్తుతాయి.
తరచూ నీరసంగా ఉంటారు.ఏ పనిలోనూ చురుగ్గా పాల్గొనలేరు.
ఇలా ఐరన్ లోపం కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే ఐరన్ లోపాన్ని దూరం చేసుకోవడం కోసం మందులు వాడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల ఆహారాలు డైట్ లో ఉంటే ఐరన్ కొరత అన్న మాటే అనరు.
మరి ఇంతకీ ఆ ఐదు రకాల ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ రిచ్ ఫుడ్స్ లో కివీ పండు ఒకటి.రోజుకు ఒక కివీ పండును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ తో పాటు మరెన్నో పోషకాలు అందుతాయి.
కివీ పండు ఐరన్ లోపాన్ని తరిమి కొడుతుంది.ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
పలు రకాల క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తుంది.అలాగే ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు నిత్యం పాలకూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.నిత్యం పాలకూరను తీసుకుంటే ఐరన్ లెవెల్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతాయి.
"""/" /
నట్స్ అండ్ సీడ్స్.ఐరన్ కొరతను దూరం చేయడానికి సహాయపడతాయి.
బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటి నట్స్ అండ్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ తో సహా ఎన్నో ముఖ్యమైన పోషకాలను చేకూరుస్తాయి.
ఐరన్ కు మరో గొప్ప మూలం బీట్ రూట్.నిత్యం ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఐరన్ లోపం మీ దరిదాపుల్లోకి రావాలంటేనే భయపడుతుంది.
ఇక శనగల్లో కూడా ఐరన్ మెండుగా ఉంటుంది.తరచూ ఒక కప్పు ఉడికించిన శనగలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఐరన్ తో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది.
శనగలు నీరసాన్ని తరిమికొట్టి ఎక్కువ సమయం పాటు బాడీని శక్తివంతంగా ఉంచుతాయి.వెయిట్ లాస్ కు కూడా గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!