లేఆఫ్ సీజన్లో కూడా రిక్రూట్ చేసుకుంటున్న 5 కార్పొరేట్ కంపెనీలు ఇవే!
TeluguStop.com
ప్రస్తుతం లేఆఫ్ సీజన్ మొదలైంది.రాబోయే సంవత్సరాలలో మరిన్ని తొలగింపులు వుంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇలాంటి పరిస్థితులలో కూడా భారతదేశంలో చాలా కంపెనీలు నియామకాలు జరపడం విశేషం.Naukri!--com యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయా ఏం చెబుతున్నారంటే గత 3 నెలల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న IT రంగం ఫిబ్రవరిలో 10% వృద్ధిని కనబరిచిందని చెప్పుకొచ్చాడు.
అయితే, డేటా సైంటిస్ట్‌లు మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకు డిమాండ్ అంతగా పెరగలేదు. """/" /
ఇకపోతే పెద్ద ఎత్తున కొత్త రిక్రూట్‌మెంట్‌ల కోసం ఎదురు చూస్తున్న టాప్ టెక్ సంస్థలు గురించి ఇక్కడ చూద్దాం.
అకౌంటింగ్ మరియు కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి "ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియా" వచ్చే ఐదేళ్లలో 30,000 మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.
ఈ కంపెనీ భారతదేశంలో అసోసియేట్స్ నుండి మేనేజర్ పాత్రల వరకు వివిధ స్థాయిలలో ఉద్యోగాల నియామకం చేస్తోంది.
అదే విధంగా ఇన్ఫోసిస్‌లో 4,263 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్ ప్రకారం తెలుస్తోంది.
"""/" /
అదే విధంగా విమానాల మానవ వనరుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎయిర్ ఇండియా ఈ సంవత్సరం 900 మంది కొత్త పైలట్‌లను మరియు 4,000 మంది క్యాబిన్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది.
విప్రోకు భారతదేశంలో 3,292 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా లింక్డ్‌ఇన్ తెలిపింది.
ఇంజనీరింగ్ – సాఫ్ట్‌వేర్, IT సమాచార భద్రత వంటి విభాగాల్లో రిక్రూట్ చేయనుంది.
ఈ విషయమై విప్రో అధికారిక కెరీర్ సైట్ ఓ ప్రకటనలో పేర్కొంటూ.నిరంతర అభివృద్ధే ధ్యేయంగా రాబోయే సంవత్సరాలలో మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని పేర్కొంది.
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్