ఈ ముగ్గురు ముద్దు గుమ్మలు మళ్లీ సక్సెస్ కొట్టేనా?

సౌత్ లో ఈ వారం మూడు క్రేజీ ప్రాజెక్టులు జనాల ముందుకు రాబోతున్నాయి.

ఈ మూడు సినిమాల్లోనూ టాప్ హీరోలు నటిస్తున్నారు.ఈ సినిమాలు జనాలను ఏమేరకు ఆకట్టుకుంటాయి? అనే విషయం త్వరలోనే తేలే అవకాశం ఉంది.

ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటి? అందులో హీరోలు, హీరోయిన్లు ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/"/ సౌత్ లో ఈ వారం విడుదల అవుతున్న ఆ మూడు సినిమాలు.

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్.కోలీవుడ్ స్టార్ సూర్య యాక్ట్ చేసిన ఎద‌ర్కుమ్ తుణింద‌వ‌న్, వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్ హీరోగా చేసిన మార‌న్.

ఈ మూడు సినిమాల్లో ఎద‌ర్కుమ్ తుణింద‌వ‌న్ (ఈటీ) మార్చి 10న జనాల ముందుకు రాబోతుంది.

రాధే శ్యామ్ మార్చి 11న థియేటర్లలో సందడి చేయబోతుంది.అటు మార‌న్ సినిమా సైతం రాధే శ్యామ్ రిలీజ్ రోజునే ఓటీటీ వేదిక అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది.

"""/"/ అటు ఈ సినిమాలో హీరోయిన్లుగా ముగ్గురు అందాల భామలు నటిస్తున్నారు.రాధే శ్యామ్ లో సౌత్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మార‌న్ సినిమాలో మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్ గా చేస్తుంది.ఎద‌ర్కుమ్ తుణింద‌వ‌న్(ఈటీ)లో ప్రియాంక అరుళ్ మోహ‌న్ క‌థానాయిక‌గా కనిపిస్తోంది.

ఈ ముగ్గురు హీరోయిన్లు నటించిన గత సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.అర‌వింద స‌మేత‌ సినిమా మొదలుకుని మ‌హ‌ర్షి, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్, అల వైకుంఠ‌పుర‌ములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ తో వరుసగా ఐదు హిట్లు అందుకుంది పొడుగు కాళ్ల సుందరి పూజా.

తాజాగా రాధే శ్యామ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకునేందుకు రెడీ అయ్యింది.

ఇక మాళ‌విక గ‌తసినిమా మాస్ట‌ర్.ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.

అటు ప్రియాంక ప్రీవియ‌స్ గత సినిమా డాక్ట‌ర్.ఈ సినిమా కూడా మంచి జనాదరణ అందుకుంది.

తాజాగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.గత సక్సెస్ ను కొనసాగిస్తారో? లేదో? వేచి చూడాలి.

శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?