సెలవు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉండరు
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేక తీవ్ర అస్వస్థతకు పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ సెలవు రోజుల్లో గేటుకు తాళం వేసి ఉండడంతో వివిధ అనారోగ్య సమస్యలపై వచ్చినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు.
అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతం కావడంతో దశాబ్ద కాలంగా ఇక్కడ 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని గత పాలకులకు,స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని,ప్రభుత్వాలు మారినా గుండాల మండల ప్రజల తల రాతలు మారడం లేదని అంటున్నారు.
రాజకీయ పార్టీల నాయకులు మండల ప్రజలను కేవలం ఓటర్లగా మాత్రమే చూస్తున్నారని, ప్రజల అవసరాలను ఏ నాయకుడు గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై వైద్యాధికారిణి హేమలతను వివరణ కోరగా ప్రభుత్వ సెలవు రోజులల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంటారని,ఆ తర్వాత ఏవైనా వైద్య సేవలు అవసరమైతే పక్కనే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ పిహెచ్సిలో 24 గంటల వైద్య సదుపాయం ఉన్నదని,ఎమర్జెన్సీ టైంలో అక్కడికి వెళ్లాలని సూచిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ Vs సుజీత్ ఇద్దరిలో ఎవరు బెస్ట్…