గాంధీభవన్ ను అమ్మే పరిస్థితి వస్తుంది..: మాజీ ఎమ్మెల్యే విష్ణు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తనకు తీరని అన్యాయం చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆయన కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదని చెప్పారు.

గాంధీభవన్ ను కూడా భవిష్యత్ లో అమ్మే పరిస్థితి వస్తుందన్నారు.బీఆర్ఎస్ లోకి రావాలని మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారని తెలిపారు.

హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!