ఏపీలో దొంగ ఓట్లు ఉండకూడదు..: మంత్రి పెద్దిరెడ్డి
TeluguStop.com
ఏపీలో ఓట్ల వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 60 లక్షల ఓట్లు ఎక్కువగా చేర్చించారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో 12 వేల దొంగ ఓట్లను తొలగించామన్న ఆయన రాష్ట్రంలో ఎక్కడా దొంగ ఓట్లు ఉండకూడదని పేర్కొన్నారు.
త్వరలో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ సింగిల్ గానే పోటీకి వెళ్తారని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఈసారి కూడా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ అధికారంలోకి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పిల్లిని చంపి వండుకు తిన్న యూఎస్ మహిళ.. ఆమెకు పడిన శిక్ష తెలిస్తే..