మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే..: సీఎం జగన్
TeluguStop.com
కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి( YS Avinash Reddy ) జీవితం నాశనం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.
మైనార్టీలకు( Minorities ) నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న ఆయన ఇది జగన్ మాటని చెప్పారు.
మైనార్టీ రిజర్వేషన్లకు( Minorities Reservations ) వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా.చంద్రబాబు( Chandrababu ) ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే మైనార్టీలను వేరుగా చూడటం న్యాయమేనా అని నిలదీశారు.మైనార్టీలకు అండగా ఉంటామన్న సీఎం జగన్ మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్లను కల్పించామని తెలిపారు.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!