బుల్లితెర నటి,నటి, టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్.నిజానికి అవికా గోర్ అనే పేరు కంటే చిన్నారి పెళ్ళికూతురు ఆనంది అనే పేరు ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటుంది.
2008లో బాలీవుడ్ బుల్లితెరలో ప్రసారమైన బాలికా వధు అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన అవికా గోర్.
ఈ సీరియల్ డబ్బింగ్ తో చిన్నారి పెళ్లి కూతురుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత వెండితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.ఇదిలా ఉంటే తనకు ఒక ఆశ ఉందని అది ఎప్పుడు నెరవేరుతుందోనని అంటుంది.
"""/"/
బాలీవుడ్ బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటించిన అవికా.'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.
తన కెరీర్ మొదలు పెట్టిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ కొత్త నటులతో సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రారంభం కానుంది.
ఇక ఈ సీరియల్ తన జీవితాన్ని మార్చేసిందని అవికా తెలిపింది.చిన్నారి పెళ్లికూతురు 2 గురించి మాట్లాడుతూ.
ఎదిగిన ఆనంది పాత్రలో చెయ్యమంటే సంతోషంగా చేస్తానని తెలిపింది.ఒక ఆర్టిస్టుగా తనకు ఆ సీరియల్ చాలా ఇచ్చిందని.
ఒకవేళ నిర్మాతలు తనకు అవకాశం ఇస్తే తన కళ్ళలో నీళ్ళు, పెదాలపై చిరునవ్వు వస్తుందని తెలిపింది.
మరో ఆలోచన కూడా లేకుండా ఈ సీరియల్ లో భాగం కావాలని అనుకుంటుందట.
ఇందులో చేయడానికి ఇష్టపడతాను అని తెలిపింది.ఈ సీరియల్ లో నటించాలని ఆశ ఉందని కానీ ఎప్పుడు తీరుతుందో అని తెలిపింది.
కానీ దురదృష్టవశాత్తు.ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు ఉన్నాయని.
కమిట్ మెంట్స్ కూడా ఇచ్చాం అని తెలిపింది.నిజానికి నటించే అవకాశం కూడా కుదరదని తెలిపింది.
"""/"/
కానీ ఇందులో తనకు మరో అవకాశం వచ్చింది.కొత్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇందులో తనకు ప్రచారకర్తగా అవకాశం వచ్చింది.
ఆగస్టు 9న హిందీ లో 'బాలికా వధు' సీరియల్ మొదలుకానున్నదని.ఈ కొత్త సీరియల్ చూడమని ప్రేక్షకులకు చెప్పబోతున్నాను అని తెలిపింది.
ఈ సీరియల్ కు కొత్త మలుపు రావడానికి తనను నిర్మాతలు అడిగిన వెంటనే ఓకే అని చెప్పేసిందట.
మొత్తానికి చిన్నారి పెళ్లికూతురు 2 లో ఒక చిన్న అవకాశాన్ని అయినా అందుకున్నందుకు సంతోషమే అని తెలిపింది.
ఇక ప్రస్తుతం 'థాంక్ యు' సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా పాప్ కార్న్, అమరన్ అనే వరుస సినిమాలలో కూడా నటిస్తుంది.
బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది… ఎన్టీర్ మాట వినాల్సింది: సంపూర్ణేష్ బాబు