ఈ పుణ్యక్షేత్రం లో ఇప్పటికీ అంతుచిక్కని కోనేరు మిస్టరీ..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఎన్నో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఉన్నాయి.అలాగే పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు ( Devotees )తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుంటూ ఉంటారు.
అలాగే మన దేశంలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో అనేక రకాల రహస్యాలు దాగి ఉన్నాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రం( Mahanandi Temple )లో ఉన్న కోనేరు ఒక అద్భుతం అని భక్తులు చెబుతున్నారు.
ఎందుకంటే కాలాలతో సంబంధం లేకుండా ఈ కోనేరులో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.
ఎంతో స్వచ్ఛమైన నీటితో కోనేరు ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. """/" /
అంతే కాకుండా ఆ కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగు నీరును అందిస్తుంది.
కానీ ఈ కోనేరులో నీరు ఎక్కడ నుంచి వస్తుందనేది పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.
ఈ మిస్టరీని ఛేదించేందుకు కోనేరు పై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు కూడా జరుపుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే వానాకాలం లో అంటే కోనేరులో సాధారణంగా నీరు ఉంటుంది.కానీ ఎండాకాలం కూడా వానాకాలం లాగే నీటిమట్టం ఒకేలాగా ఉంటుంది.
ఇందులో 5 ధారాలుగా వచ్చి పడే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు.
ఈ కోనేరులో స్నానమాచరిస్తే అనారోగ్య సమస్యలు( Health Problems ) దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు.
"""/" /
అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు.
మహానంది క్షేత్రాన్ని తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయంలో శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం ( Sri Mahanandiswara Swamy )కింద నుంచి నీరు ప్రవహిస్తూ రుద్రగుండం కోనేరులోకి వస్తుంది.
అక్కడి నుంచి మహావిష్ణువు ( Lord Vishnu )గుండం కోనేరులోకి వస్తుంది.ఈ నీరు మహానంది చుట్టుపక్కల వందల ఎకరాల పంట పొలాలకు నీటిని అందిస్తూ ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా 10 అడుగులలోనే జలం ఊబికి వస్తుంది.అయితే మహానంది క్షేత్రం కోనేరులోని నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది అంతు పట్టనీ రహస్యం అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఈ కోనేరులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు గతంలో అనేకమంది చాలా ప్రయత్నాలు చేశారు.
కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
చైనా: రూ.55 లక్షలు నీళ్లపాలు.. వధువు అసలు రహస్యం బయటపడటంతో వరుడు లబోదిబో..