‘ వ్యూహాం’ సినిమాలో ఎలాంటి వ్యూహం లేదు..: ఆర్జీవీ
TeluguStop.com
విజయవాడలో రేపు ‘వ్యూహాం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశీలించారు.
పరిశీలన అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ తమ ‘ వ్యూహాం’ సినిమాలో ఎలాంటి వ్యూహం లేదని చెప్పారు.
సీఎం జగన్ కు ఈ వ్యూహానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తమ ఆలోచనతో రూపకల్పన చేసిన సినిమా తీశామన్నారు.ఈ చిత్రం ద్వారా ఒక నిజాన్ని చెప్పబోతున్నామన్న ఆర్జీవీ ఈ మూవీలో తెలంగాణ రాజకీయాలు లేవని వెల్లడించారు.
అలాగే తమ మూవీ ఈవెంట్ కు కొందరు వైసీపీ నేతలు హాజరు అవుతారని తెలిపారు.
శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?