కాంగ్రెస్ పార్టీ మారే ఆలోచన లేదు..: మోత్కుపల్లి

కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Narasimhulu ) నిరసన దీక్ష కొనసాగుతోంది.

హైదరాబాద్ బేగంపేటలోని( Begumpet ) నివాసంలో ఆయన చేపట్టిన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.

మాదిగలకు కాంగ్రెస్( Congress ) ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంపై మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మాదిగలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఇది మాదిగలకు తీవ్రమైన అవమానమన్న మోత్కుపల్లి నర్సింహులు మాదిగలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే మాదిగలను కాంగ్రెస్ కు దూరం చేయకండని తెలిపారు.కనీసం రెండు ఎంపీ టికెట్లు మాదిగలకు ఇవ్వాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

అలాగే తాను చేపట్టిన దీక్ష పార్టీకి వ్యతిరేకం కాదన్న ఆయన తమ జాతి ఉనికి కోసమని పేర్కొన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీ మారనని స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024