వైసీపీని వదిలిపెట్టేదే లేదు.. చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీని వదిలి పెట్టేదేలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.జీవో నెంబర్ .

1, ఎమ్మెల్యే స్వామిపై దాడి ఘటనపై కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.ఈనెల 25 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు.సభలో స్వామిపై దాడి చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

జీవో నెంబర్.1 ను రద్దు చేయాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు.

ఆగస్ట్ సంక్షోభం, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదన్నారు.ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.

వామ్మో.. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే! (వీడియో)