రాజ్‎భవన్‎కు, ప్రగతిభవన్‎కు గ్యాప్ లేదు..: గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాజ్‎భవన్‎కు, ప్రగతిభవన్‎కు ఎలాంటి దూరం లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

తన ఫోకస్ అంతా ప్రజల అభివృద్ధి కోసమేనని తెలిపారు.అయితే ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగిందని గవర్నర్ తమిళిసై చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల లబ్ది కోసమే తాను బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుందన్న ఆమె గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం లేదన్నారు.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పవర్ ఫుల్ నాయకుడని తెలిపారు.

అటు తమిళనాడులో ఓ సెక్షన్ ప్రజలను అవమానించే ప్రక్రియ జరుగుతోందన్నారు.ఎవరి సంప్రదాయాలు వాళ్లకు ఉంటాయన్న గవర్నర్ తమిళిసై ఒక మతాన్ని, కులాన్ని చులకన చేసి చూడొద్దని వెల్లడించారు.

అనంతరం జమిలి ఎన్నికలకు తన మద్ధతు అని తెలిపారు.

ఎలుక వర్సెస్ ఎలుక.. రెజ్లింగ్‌లో లాగా డిష్యుం డిష్యుం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..?