చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..: మంత్రి బొత్స

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) అన్నారు.

చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు( Chandrababu Naid )ను ఏ విధంగా సంభోదించాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.

విశాఖను రాజధానిగా చంద్రబాబు ఎందుకు సమర్థించడం లేదని నిలదీశారు.విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఉత్తరాంధ్ర( Uttarandhra ) 34 నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.ఒక స్కీమ్ లేదన్నారు.

చంద్రబాబుకు కనీసం ఏపీలో సొంత ఇల్లు కూడా లేదని విమర్శించారు.

డాకు మహారాజ్ మూవీకి ఆయనే స్పూర్తి.. పరుచూరి రివీల్ చేసిన షాకింగ్ విషయాలివే!