చంద్రబాబు భద్రతపై ఎటువంటి రాజీ లేదు..: ఏపీ డీజీపీ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ఏపీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.
ఈ మేరకు చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.జైలు అధికారికి తెలియకుండా ఎలాంటి లేఖలు రావని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు భద్రతపై ఎటువంటి రాజీ లేదన్న ఆయన పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టామన్నారు.భువనేశ్వరి యాత్ర కోసం తమను ఎవరూ కలవలేదని చెప్పిన ఆయన తమను సంప్రదిస్తే ఆలోచిస్తామని వెల్లడించారు.
బన్నీకి నో చెప్పి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు యస్ చెప్పిన క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?