కల్కి : తెలుగు వర్సెస్ తమిళ్.. అక్కడ మనల్ని పట్టించుకున్న వాడే లేడు !
TeluguStop.com
తమిళులు ఎవరిని దగ్గర తీయరు అనేది అందరికి తెలిసిన విషయమే.వారిలో వారికే కాంపిటీషన్ .
వారి పోటీలో ఎవ్వరిని దగ్గరికి రానివ్వరు.వారి సినిమాలు మాత్రమే నడుస్తాయి.
పక్క భాషల చిత్రాలను కనీసం దేకరు.కానీ మనం అలా కాదు.
ఆ భాష ఈ భాష అనే తేడా లేదు.ఎవరి సినిమా బాగున్నా కూడా మనం హిట్ చేస్తాం.
ఉదాహరణకు ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా మహారాజా( Maharaja ) కేవలం వైజాగ్ లోనే కోటి రూపాయలు వసూలు చేసింది.
బాహుబలి 2 తర్వాత ఈ రికార్డు సొంతం చేసుకున్న రెండవ సినిమాగా ఈ చిత్రం చరిత్రకు ఎక్కింది.
అంతలా మనవారు పరభాష సినిమాలను ఆదరిస్తారు.కేజీఎఫ్ సినిమాను కూడా తెలుగులో పెద్ద హిట్ చేశారు.
ఏ భాష అయినా మనం కంటెంట్ బాగుంటే వదిలే ప్రసక్తే లేదు. """/" /
కానీ మన కల్కి సినిమా( Kalki 2898 AD ) బుకింగ్స్ తమిళనాడులో ఘోరంగా ఉన్నాయి.
అక్కడ ఉన్న తెలుగువారు తప్ప తమిళ వారు మన చిత్రాన్ని బుక్ చేసుకోవడం లేదు.
హిందీలో వేరే భాషల్లో కల్కి కి ఉన్న డిమాండ్ తమిళనాడులో అస్సలు కనిపించడం లేదు.
మన సినిమాకి మాత్రమే కాదు.ఎంత పెద్ద పాన్ ఇండియా చిత్రమైన, ఎంత ఘనవిజయం సాధించిన సినిమా అయినా కూడా వారికి వెంట్రుకతో సమానం.
ఇక డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా మన సినిమాలకు అస్సలు డిమాండ్ లేదు.అక్కడ మీడియాను ఓటిటిని అన్నిటిని మేనేజ్ చేసేది సన్ మీడియా మాత్రమే.
అదేనండి మన ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఓనర్.వారి చేతిలోనే అన్నీ ఉంటాయి వారిని దాటి ఒక సీఎం కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
జయలలిత ఉన్న టైంలో కూడా మీడియాలో సన్ మీడియా హడావిడిని ఏమాత్రం తగ్గించలేకపోయింది.
బయట ఓటిటీ లు ఎంత ప్రయత్నించినా కూడా వారితోనే లాలుచి పడాల్సిన పరిస్థితి.
"""/" /
ఈ విషయాన్ని ముందే గ్రహించిన నాగ్ అశ్విన్ చాలా తెలివిగా కమల్ హాసన్( Kamal Haasan ) ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నాడు.
అయినా కూడా తమిళ్ మీడియా లేదా ప్రేక్షకులు ఈ సినిమాను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే కమల్ అసలు ఆ సినిమాలో ఉన్నాడా లేదా అని అనుమానం వారిలో ఉంది.
పాత్ర డిమాండ్ చేయడం తో ఒక గెటప్ వేయాల్సి వచ్చింది.అందుకే కమల్ హాసన్ సరిగ్గా వారు గుర్తించడం లేదు.
ఇకనైనా తమిళవారి పోకడను అర్థం చేసుకొని వారిని మనం నెత్తిన నెత్తికెక్కించుకోకుండా ఉంటే బాగుంటుంది.
అక్కడ హీరోలను మాత్రమే కాదు దర్శకులను కూడా తెచ్చుకుని మన సినిమాలకు పని చేయించుకుంటున్నాం.
ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ్ దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలు అనేకం ఉన్నాయి.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు నిద్ర సరిపోవట్లేదు బాసు!