పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో( Tanuku ) హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswara Rao ) నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం చెలరేగింది.

మంత్రి కారుమూరి వెళ్లిన సమయంలోనే టీడీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఇరు పార్టీల వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.

కేవలం స్క్రీన్ ప్లే తో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలు ఇవే !