నియోజకవర్గంలో అసమర్థ ఎమ్మెల్యే ఉన్నారు..: ఎంపీ ఉత్తమ్

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కర్ణాటకలో కరెంట్ గురించి మాట్లాడటం కాదన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో 24 గంటల కరెంట్ ఉండటం లేదని చెప్పారు.

అసమర్థ ఎమ్మెల్యే ఉండటం వలనే సాగర్ లో నీళ్లు ఉన్నా హుజూర్ నగర్ లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!