అక్క‌డ భిక్షాటనకు కూడా లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి.. ఎందుకు? ఎక్క‌డ‌?

లైసెన్సు పొందిన తర్వాత మాత్రమే భిక్షాటన చేసే అవకాశం క‌ల్పించే నగరం ఒక‌టి ఉంది.

ఈ నగరం ఐరోపా దేశమైన స్వీడన్‌లో ఉన్న ఎస్కిల్‌స్టునా.సుమారు లక్ష జనాభా కలిగిన ఈ నగరం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన ఉంది.

కొన్నేళ్ల క్రితం ఇక్కడి యాచకులకు లైసెన్సు ఫీజును తప్పనిసరి చేశారు.ఇది 2019లో అమలు చేయబడింది.

ఈ నియమం ప్రకారం యాచ‌కులు.భిక్షాటన చేసేందుకు చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్ కోసం 250 స్వీడిష్ క్రోనా (స్వీడన్ కరెన్సీ) ఖర్చు చేయాలి.

ఇక్కడ భిక్షాటనను కష్టతరం చేయాలని స్థానిక నాయకులు ప్ర‌భుత్వాన్ని కోరినట్లు మీడియా కథనాలలో వెల్ల‌డయ్యింది.

ఈ విధానం వ‌ల‌న భిక్షాటన చేయాల్సిన అవసరం ఉన్న వారు నగరంలో ఎక్కడ, ఎంతమంది ఉన్నారనేది అధికార యంత్రాంగానికి సులువుగా తెలుస్తుంది.

అలాంటి వారిని సంప్రదించి వారికి అవసరమైన సహాయం అందించడం సుల‌భం అవుతుంది.ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత .

యాచ‌కులు చిన్న చిన్న పనులు చేసుకునే దిశగా పయనిస్తున్నారని స్థానిక పత్రికలు తెలిపాయి.

స్వీడన్‌లోని వివిధ నగరాల్లో యాచించడం నిషేధించబడింది.కొన్ని ప్రాంతాల్లో కనీస భిక్షాటనకు కూడా అనుమతి లేదు.

ఇలాంటి పాలనపై విమర్శలు వచ్చాయి. """/"/ భిక్షాటన చేసే కొందరి పరిస్థితి విషమంగా మారింద‌ని ఈ నిబంధనకు వ్యతిరేకంగా నిలబడిన వారు చెబుతున్నారు.

ఇక్కడి పరిపాలన‌, న్యాయ వ్యవస్థ కారణంగా కొంతమంది బలవంతంగా భిక్షాటన చేయవలసి వస్తోందని వారు వాదిస్తున్నారు.

బిచ్చగాళ్లకు, నిరుపేదలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.వారికి సహాయం చేయడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

ప్రముఖ నటుడు రంగస్థలం మహేష్ భార్యను చూశారా.. అచ్చం హీరోయిన్ లా ఉందంటూ?