ఆ నియోజకవర్గంలో వర్గ పోరు.. బీఆర్ఎస్ గెలుపు కష్టమేనా..?
TeluguStop.com
బీఆర్ఎస్ (BRS) పార్టీలో రోజుకొక కొత్త చర్చ నడుస్తోంది.తాజాగా ఆ నియోజకవర్గంలో వర్గ పోరు మరీ ఎక్కువైనట్టు సమాచారం.
ఇక ఈ లెక్కన చూసుకుంటే ఆ నియోజకవర్గంలో గెలుపే బీఆర్ఎస్ గెలుపు అనే విధంగా మారిపోయింది.
అయితే చాలా రోజుల నుండి ఆ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉంది.
కానీ అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం వర్గ పోరు జరుగుతుంది.మరి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటా అని భావిస్తున్నారా.
అదేనండి స్టేషన్ ఘన్ పూర్ .స్టేషన్ ఘన్ పూర్ ( Station Ghanpur )లో రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది.
ఈ నియోజకవర్గంలో ఈసారి తాటికొండ రాజయ్య ( T Rajaiah ) కు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చారు.
ఇప్పటివరకు కడియం శ్రీహరి( Kadiyam Srihari ) పై ఎలాంటి మచ్చలేదు.కానీ తాటికొండ రాజయ్య ఇప్పటికే ఎన్నో విషయాల్లో అడ్డంగా దొరికిపోయారు.
ఇక ఈయన అక్రమాలు చేసినప్పటికీ స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రం మంచి పేరు ఉంది.
కానీ ఆయనను పక్కనపెట్టి ఈసారి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు.కానీ తాటికొండ రాజయ్య మాత్రం చివరి వరకు తనకే టికెట్ వస్తుందని భావించినప్పటికీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో కాస్త అసంతృప్తితో వేరే పార్టీలోకి వెళ్తారని అందరూ భావించారు.
"""/" /
ఇక ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ ( KCR ) ఆయనను పిలిపించుకొని మరీ బుజ్జగించారు.
దాంతో ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి స్టేషన్ ఘన్ పూర్ లో బిఆర్ఎస్ వచ్చేలా పాటుపడాలని చెప్పారు.
కానీ కెసిఆర్ బుజ్జగింపుతో తన కోపం చల్లారినప్పటికీ కడియం శ్రీహరికి మాత్రం తాటికొండ రాజయ్య మద్దతు ఇవ్వడం లేదు.
ఎక్కడ కూడా కడియం శ్రీహరితో ఆయన ఎన్నికల ప్రచారంలో తిరగడం లేదు.ఇక తాటికొండ రాజయ్య వర్గీయులు అలాగే కడియం శ్రీహరి వర్గీయులకు మధ్య లోలోపల గొడవలు జరుగుతున్నాయట.
"""/" /
అంతేకాకుండా స్టేషన్ ఘన్ పూర్ లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్ధన్నపేట ( Wardhannapet )కు మార్చారు.
దీనికి కారణం కూడా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి ( Kadiyam Srihari ) కి మధ్య జరుగుతున్న గొడవలే అని తెలుస్తుంది.
దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఈ విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు.అలాగే ఇక్కడ ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ గద్దనెక్కుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది.
అందుకే ప్రస్తుతం బీఆర్ఎస్ అదిష్టానం స్టేషన్ ఘన్ పూర్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.. తెలుసా?