ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ ని నివరించాల్సిన అవసరం ఉంది ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత
TeluguStop.com
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగానికి బలైపోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితుల్లో దానిని నివరించాల్సిన అవసరం ఉందని ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు.
గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన "కేర్ ఫర్ కోలోన్ " అనే అవగాహన కార్యమాన్ని ఎం ఎల్ సి కవిత విచ్చేసి ప్రారంభించారు.
హైదరాబాద్ మహానగరంలో అత్యాధునికి వైద్యాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఎ ఐ జి హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఎమ్ ఎన్ జి హాస్పిటల్ తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పై అవగాహన సదస్సు ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
మన అందరం ప్రతి సంవత్సరం విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని,మితా ఆహారం,వ్యాయామం వంటి ఆరోగ్య కరమైన అలవాట్లతో క్యాన్సర్ ని అరికట్ట వచ్చని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ లో కొత్త గా ఏర్పాటు చేసిన కోలన్ క్యాన్సర్ యూనిట్ ను ఆమె ప్రారంభించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్12, శనివారం 2025