మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వేమనపల్లి మండలంలో పోడు రైతుల మధ్య వాగ్వివాదం చెలరేగింది.

భూమి తమదంటే తమదని కారం పొడి చల్లుకున్న పోడు రైతులు పరస్పరం కర్రలు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు.

ఈ దాడిలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.

అనంతరం రెండు వర్గాలకు చెందిన సభ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.