ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది..: పర్చూరు ఎమ్మెల్యే

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ప్రతి నియోజకవర్గంలో 25 వేల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.

45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7లు అప్ లోడ్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన అధికారులపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏలూరి డిమాండ్ చేశారు.

రేవ్ పార్టీ ఇష్యూ తరువాత మొదటిసారి తిరుమల వచ్చిన హేమ.. ఫోటోలు వైరల్!