గుంటూరు తొక్కిసలాట ఘటనలో కుట్ర అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో రోడ్డు షో, సభలను నియంత్రించేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై జనసేన నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ జీవో తీరు చూస్తే అభద్రతాభావంతో వైసీపీ ఉన్నట్లు వ్యాఖ్యానించారు.చట్టరీత్యా సభలు మరియు ఊరేగింపులు జరుగుతుంటే ప్రభుత్వంకి ఎందుకంత భయమని అన్నారు.

కానీ ఇటీవల దురదృష్టవశాత్తు చంద్రబాబు సభలో చనిపోవడం జరిగింది.మాకున్న సమాచారం ప్రకారం మొదటి సభలో కంటే గుంటూరులో జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం వెనకాల కుట్ర కోణం దాగివున్నట్లు నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు.

ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు రోడ్డు షో ద్వారా సభల ద్వారా తెలుసుకునే హక్కు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించింది.

దీనిని హరించడానికి మీరెవరు.?, ఏపీలో రాజరికపు పాలన సాగుతుందా.

? అసలు ఇటువంటి జీవోలు న్యాయస్థానాల్లో నిలబడతాయా.? అని మండిపడ్డారు.

ఈ రకంగానే గత ప్రభుత్వం టీడీపీ వ్యవహరిస్తే మీరు పాదయాత్రలు చేయగలిగేవారా.? అని వైసీపీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?