అక్కడ కేవలం మహిళల కోసమే 102 అంతస్తుల భవనం వెలసింది!
TeluguStop.com
అవును, అక్కడ కేవలం మహిళలకోసమే ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 102 అంతస్తుల భవనం వెలసింది.
అది కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు.పురుషులకు అక్కడ అనుమతి లేదు.
స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఆ ఆ ప్లాట్‌లను ఎంతో అందంగా తీర్చిదిద్దారు.ఇంతకీ అదెక్కడుందంటే, యూకేలో( UK ) ఉంది.
అవును, బ్రిటన్( Britain ) మొదటి సారిగా మహిళల కోసమే ఆ బహుళ అంతస్తుల భవనాన్ని లండన్‌లో నిర్మిస్తోంది.
"""/" /
అసలు విషయంలోకి వెళితే, 1902లో ఓటింగ్ ఉద్యమంలో భాగంగా స్థాపించిన హౌసింగ్ అసోసియేషన్ దీన్ని అక్కడ నిర్మిస్తుంది.
ఈ ప్రోపర్టీ యజమాని అక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా మోనోపాజ్( Monopause ) దాటిన పెద్ద వయసు మహిళలకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్ ఉండేలా ఆధునాత సౌకర్యాలతో ప్రతి అపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఫ్లాట్‌లను కేవలం గృహవేధింపులకు గురైన మహిళలకు, ఒంటరి మహిళలకు, నల్లజాతి స్త్రీలకు, అవసరమైతే ఒంటరిగా ఉన్న మైనారీటి మహిళలకు మాత్రమే అద్దెకు ఇస్తారని సమాచారం.
"""/" /
డబ్ల్యూపీహెచ్ నిబంధనల ప్రకారం.ఒంటరి మహిళలు మాత్రమే ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండడానికి అర్హులు.
అదే విధంగా ఒంటిరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు ఉండడానికి అర్హులే.
అలాగే ట్రాన్స్‌జెండర్ మహళలు కూడా అక్కడ అద్దెకు ఉండవచ్చు.కాగా ఈ భవనంపై కోర్టులో వివాదం నడుస్తున్నట్లు సమాచారం.
కొందరు మాత్రం ఈ ప్రాజెక్టు అంతగా బాగోలేదని పెదవి విరవగా మహిళలకు మాత్రం ఆ భవనానికి పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
కష్టాల్లో వున్న అనేకమంది ఒంటరి మహిళలకు ఇది ఎంతో సహకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికి నితిన్ స్టార్ హీరో ఎందుకు కాలేకపోయాడు…