అక్కడ ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది… ఎక్కడంటే?
TeluguStop.com
ఈ మధ్య వ్యాపారస్తులకు క్రియేటివిటీ ఎక్కువైంది.జనాల్ని అట్రాక్ట్ చేయడానికి వివిధ రెస్టారెంట్ నిర్వాహకులు చిత్రమైన పేర్లు, చిత్రమైన థీమ్ లతో వస్తున్నారు.
ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది.అవును, దాని పేరు వింటేనే మీకు హార్ట్ ఎటాక్ రావచ్చు.
మీరు ఊహించింది నిజమే, దాని పేరు కూడా 'హార్ట్ ఎటాక్( Heart Attack )'నే.
ఇక అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందనే అనుమానం మీకు కలగడం సహజం. """/" /
ఈ రెస్టారెంట్‌ను 'జాన్ బాసో' అనే వ్యక్తి 2005లో స్టార్ట్ చేయగా నేడు దానికి అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇక దాని లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేదంటే ఆసుపత్రికి వచ్చామా? అనే అనుమానం కలగక మానదు.
ఇక్కడికి వచ్చే కస్టమర్లు పేషెంట్స్ లాగా గౌనులు వేసుకుని లోనికి వెళ్లాలనే రూల్ వుంది.
ఇక ఇక్కడ వెయిట్రస్ నర్సులుగా, డాక్టర్లుగా( Doctors ) అక్కడ సర్వ్ చేస్తూ వుంటారు.
ఇక అక్కడ కస్టమర్స్ ఇచ్చే ఆర్డర్‌ను ప్రిస్క్రిప్షన్ అని పిలవాలి.కాగా ఇక్కడ దొరికే హ్యామ్ బర్గర్( Ham Burger )లో 10 వేల క్యాలరీలు ఉంటాయని వినికిడి.
"""/" /
అవును, మీరు విన్నది నిజమే.ఇలా ఇక్కడ అన్నీ అతిగానే ఉంటాయి మరి.
మిల్క్ షేక్, బటర్ ఫ్యాట్, ఫుల్ షుగర్ కోలా, పిల్లల కో్సం క్యాండీ సిగరెట్స్ కూడా దొరుకుతాయట.
ఆర్డర్ చేసాక తెచ్చినవి తినకపోతే సరదాగా బెల్టుతో కొడతారట.ఇది అదనపు హంగు అని అనుకోకతప్పదు.
ఇంకో విషయం ఏంటంటే 350 పౌండ్ల కన్నా బరువున్న వారు ఈ రెస్టారెంట్‌కి వెళ్తే ఫ్రీగా ఫుడ్ పెడతారని వినికిడి.
ఏంటి వింటూంటే హార్ట్ ఎటాక్ వస్తోందా.ఒకసారి ట్రై చేస్తారేమిటి!.
నిత్యం పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా?