నా లైఫ్ లో రిగ్రీట్స్ ఏం లేవు.. కేవలం అనుభవాలు మాత్రమే.. హరితేజ పోస్ట్ వైరల్!
TeluguStop.com
బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.
యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.
2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ఇక 2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.
దాదాపు ఏడు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.
ఇక ఆమె 2015 లో దీపక్ ను వివాహమాడగా.తమకు ఒక కూతురు కూడా ఉంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటుంది.
"""/"/
తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.
తనకు మరో బుల్లితెర నటి నవ్య స్వామి మంచి ఫ్రెండ్.తనతో కలిసి జిమ్ వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.
ఇద్దరు కలిసి పార్టీలంటూ తిరుగుతూ బాగా రచ్చరచ్చ చేస్తారు.అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా హరితేజ తన ఇన్ స్టా లో ఓ స్టోరీ పంచుకుంది.
నిజానికి హరితేజ తనకు ఎదురయ్యే సంఘటనలను స్టోరీ రూపంలో బాగా పంచుకుంటూ ఉంటుంది.
అంతే కాకుండా వాటికి తగ్గట్టు ఫోటోలను కూడా పెడుతూ ఉంటుంది. """/"/
అలా తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తల జుట్టు విరబోసుకుని ఆ ఫోటో కి ఒక క్యాప్షన్ ఇచ్చింది.
ఇక అందులో ఏముందంటే.తన లైఫ్ లో ఏం రిగ్రీట్స్ లేవని.
కేవలం అనుభవాలు మాత్రమే ఉన్నాయి అని తెలిపింది.ఇక ఈమె షేర్ చేసుకున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా.
హరితేజ చెప్పిన మాటకు లైకులు కొడుతున్నారు.అంతేకాకుండా కొన్ని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.
ఇక హరితేజ ప్రస్తుతం ఓ వైపు ఫోటో షూట్ లతో.మరోవైపు పలు ప్రాజెక్టులతో బాగా బిజీగా దూసుకెళ్తుంది.