వైరల్: సంకల్పం చేయాలేగాని, అనేకమార్గాలు! ఆనంద్ మహీంద్రా బుల్డోజర్ ట్వీట్!

ఆనంద్ మహీంద్రా గురించి తెలిసిందే.బేసిగ్గా అతనికి ఏదన్నా కాస్త ఇన్నోవేటివ్ గా కనబడిందంటే చాలు, అతని ట్విట్టర్ హేండిల్ లో అది షేర్ అవ్వాల్సిందే.

తాజాగా అలాంటి న్యూస్ ఒకటి షేర్ చేశారు.గ‌త రెండురోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నీట మునిగిన సంగతి విదితమే.

దీంతో ఐటీ రాజ‌ధానిలోని పలు ప్రాంతాలు సముద్రాన్ని త‌లాపిస్తున్నాయి.గ‌త రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల‌కు బెంగళూరు వాసులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ర‌వాణా వ్య‌వ‌స్థ స్థంభించింది.పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్ స‌మ‌స్య‌లు త‌ల్లెత్తున్నాయి.

ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే.మహీంద్రా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.

ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌కు సంబంధించిన ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.సదరు వీడియోలో ఏముందో చూస్తే, ఇందులో ఇద్ద‌రు డ్రైవ‌ర్ వ‌ద్ద నిల్చుని ఉండ‌గా, మ‌రికొంద‌రూ.

బుల్ డోజ‌ర్ బ‌కెట్ లో నిల్చున్నారు.ఇందులో ఉన్న వ్య‌క్తులు చాలా నిట్ గా డ్రెస్ ఆఫ్ అయి.

చేతిలో బ్యాగ్ ప‌ట్టుకొని ఐటీ ఆఫీసుల‌కు వెళ్తున్న‌ట్టుగా క‌నిపించారు.ఈ వీడియోను గోవింద్‌కుమార్ అనే వ్య‌క్తి త‌న‌ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.

ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఎక్కడ సంకల్పం ఉంటే.అక్కడ మార్గం ఉంటుంది అని కామెంట్ చేశారు.

ఈ వీడియోని చూసిన‌ యూజర్లు కూడా కామెంట్ చేస్తూ దాన్ని షేర్ చేస్తున్నారు.

అదే సమయంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ మ‌రికొంద‌రూ కామెంట్స్ చేస్తున్నారు.విచక్షణారహితమైన అభివృద్ధి ఫలితంగా ఈ విధ్వంసం జరిగిందని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.