హిల్సా చేపల ను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అతిగా తింటే మాత్రం..!
TeluguStop.com
చేపలంటే ఇష్టంగా తినే వారు హిల్సా చేపలను ఎక్కువగా తింటూ ఉంటారు.ఆ పేరు చెబుతేనే నోట్లో నీళ్లు ఉరుతాయి.
చేపలతో నచ్చిన వంటకాన్ని చేసుకోవచ్చు.అయితే హిల్సా చేపలు తింటే సరిపోదు దానివల్ల మన ఆరోగ్యం ఏమవుతుందో కూడా కచ్చితంగా తెలుసుకోవాలి.
వర్షాకాలం మొదలైతే చాలు హిల్సా చేపల కోసం బెంగాలీలు ఎదురు చూస్తూ ఉంటారు.
బెంగాలీలు భోజనంలో హిల్సా చేప( Hilsa Fish ) కూరను ఒక రాజుగా చూస్తారు.
దాన్ని మించిన మాంసాహారం మరొకటి లేదని నమ్ముతారు.హిల్సా చేపలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు.
హిల్సా చేపలు చేసే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.హిల్సా చేప రుచికరమైన ఆహరమే కాకుండా శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రోటీన్స్ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
100 గ్రాముల హిల్సాలో దాదాపు 21.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, సోడియం క్యాల్షియం, మెగ్నీషియం మరియు మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
"""/" /
హిల్సా చేప గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది.ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
అలాగే ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వివిధ రకాల గుండె జబ్బులను( Heart Disease )దూరం చేస్తుంది.
హిల్సా చేప శరీరంలో రక్తప్రసరణ ( Circulation )సక్రమంగా జరిగేలా చేస్తుంది.ఈ చేప వల్ల ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ చేపలను ఎక్కువగా తింటే భయంకరమైన వ్యాధుల బారిన పడతారని ఒక పరిశోధన లో తెలిసింది.
"""/" /
మన దేశంలో జరిపిన అధ్యయనం ప్రకారం హిల్సాను తినేవారు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.
ఎక్కువగా తింటే శరీరంలో రోగాలు వస్తాయని చెబుతున్నారు.భారత కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఈ చేప తినదగినది కాదని హెచ్చరించింది.
అలర్జీలు ఉన్న వారు ఈ చేపకు దూరంగా ఉండటమే మంచిది.అలాగే శ్వాస సమస్యలు( Breathing Problems ), దద్దుర్లు, ముక్కు కారడం, కడుపు తిమ్మిరి, చర్మ చికాకు వంటి వాటికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?