మారిన ఈటెల ' పిక్చర్ ' ! ఎన్నో అనుమానాలు ?

మారిన ఈటెల ‘ పిక్చర్ ‘ ! ఎన్నో అనుమానాలు ?

బీజేపీ, కాంగ్రెస్, కొత్త పార్టీ ! ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ఫైనల్ ఈటెల రాజేందర్ కు సంబంధించి మూడు ఆప్షన్లు కొద్దిరోజులుగా హైలెట్ అవుతున్నాయి.

మారిన ఈటెల ‘ పిక్చర్ ‘ ! ఎన్నో అనుమానాలు ?

ఆయన క్లారిటీ గా ఏ పార్టీలో చేరేది చెప్పడం లేదు.అలాగే సొంత పార్టీ ఏర్పాటుపైనా స్పందించడం లేదు.

మారిన ఈటెల ‘ పిక్చర్ ‘ ! ఎన్నో అనుమానాలు ?

దీంతో రకరకాల ఊహాగానాలు ఎన్నో  నడుస్తున్నాయి.అయినా ఈటెల మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే వస్తున్నారు.

బిజెపిలో ఆయన చేరిక ఖాయమైందని ఒక వైపు ప్రచారం జరుగుతోంది.  బీజేపీ జాతీయ నేతలతో పాటు తెలంగాణ నేతలు ఆయనతో చర్చలు జరిపారు.

బిజెపి లో చేరితే ఆయనకు కేంద్రంలో కీలకమైన పదవి దక్కుతుంది అనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు సొంత పార్టీ ఏర్పాటు విషయంపైన అదే స్థాయిలో చర్చ నడుస్తోంది.

అయినా ఈటెల మాత్రం తన మనసులో మాట ఏమిటనేది బయటకు చెప్పకపోవడం అందరికీ ఉత్కంఠగా మారింది.

ఇదిలా ఉంటే,  ఈటెల రాజేందర్ ట్విట్టర్ ఖాతా కు సంబంధించి ప్రొఫైల్ పిక్చర్ అకస్మాత్తుగా మారడం అనేక సందేహాలకు కారణం అవుతోంది.

ఈ కొత్త ప్రొఫైల్ పిక్చర్ ద్వారా సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నారా అనే అనుమానాలు బలపడే  విధంగా అందులో సంకేతాలు ఉన్నాయి.

మెడలో పచ్చ కండువా వేసుకున్న ఈటెల ఫోటోతో పాటు , పక్కనే తెలంగాణ మ్యాప్, పిడికిలి బిగించిన గుర్తు, రాష్ట్ర మ్యాప్ లో కాషాయం ఉండేవిధంగా చూసుకున్నారు.

అలాగే తెలంగాణ తల్లి ఫోటోలు కూడా దాంట్లో జతచేశారు.అలాగే తెలంగాణ అమరవీరుల చిత్రపటాన్ని కూడా అందులో ఉంచారు.

ఇక అదే ఫోటోలో జ్యోతిరావు పూలే తో పాటు, అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారు.

ఇవే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోను పెట్టారు.

"""/"/ మొత్తంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ ద్వారా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చను రాజేందర్ తెరపైకి తీసుకొచ్చారు.

అసలు రాజేందర్ అంతరంగంలో ఏముంది అనే విషయం పైకి తేలాక పోవడం తో ఆయన ఏ విధమైన స్టెప్ వేస్తారు అనేది అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.

ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యేలా కనిపిస్తోంది.

స్వయంభు సినిమాలో రామసేతు సన్నివేశాలు.. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా!