కేసీఆర్ ఢిల్లీ టూర్ వృధానా ? ఎన్నో అనుమానాలు ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి చాలా రోజులుగా అక్కడే ఉన్నారు.అక్కడ బీజేపి పెద్దలను కలిసి తెలంగాణ లో చోటుచేసుకున్న పరిణామాలపై తాడోపేడో తేల్చుకుంటామని,  ముఖ్యంగా బియ్యం కొనుగోలు విషయంలో బిజేపి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము అంటూ ఎన్నో ప్రకటనలు చేసి మరీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు కేసిఆర్.

ఆయనతో  పాటు కొంతమంది మంత్రులు అధికారులను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు.నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు.

అయితే మంత్రులు , అధికారులు కొంతమంది మంత్రులు కేంద్ర అధికారులతో ధాన్యం కొనుగోలు విషయంపై చర్చించారు.

అయితే కేసీఆర్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు,  మరికొంత మంది మంత్రుల హడావుడి చేశారు .

కానీ ఈ నాలుగు రోజుల సమయం లో కేసీఆర్ మరెవరినీ  కలవలేకపోయారు.దీనికి కారణం వారు ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని, ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము కాబట్టే అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు.

అయితే ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .కేసిఆర్ నిజంగానే బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ కోరారా లేక వేరే వ్యవహారాల కోసం ఢిల్లీకి వెళ్లి ఈ విధంగా గా చెబుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి.

ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కే సిఆర్ ఢిల్లీలో ఉండగానే ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యారు.

గతంలోనూ తెలంగాణ లో బిజేపి , టిఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు,  ప్రతివిమర్శలు కొనసాగుతున్న సమయంలోనే కేసిఆర్ ఢిల్లీ కి వెళ్లారు.

అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ.అమిత్ షా వంటి వారితోనూ భేటీ అయ్యారు.

"""/" / మరి ఇప్పుడు నిజంగా కేసీఆర్ వారి అపాయింట్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నించి ఉంటే వారు ఎందుకు దూరం పెడతారనే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి.

  ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం పై అనేక విమర్శలు చేస్తున్నారు.

  కేసీఆర్ ఢిల్లీ పర్యటన  ఉన్నప్పుడు బియ్యం,  సన్న బియ్యం కొనుగోలు అంశం కాదని , ఇంకేదో రాజకీయం చేసేందుకే అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడ “మేమంతా సిద్ధం” సభలో సీఎం జగన్ సంచలన స్పీచ్..!!