ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు చైల్డ్ సెంటిమెంటుతో( Child Sentiment ) సక్సెస్ సాధిస్తున్నాయి.
ఇప్పటికే అలాంటి సినిమాలు ఎన్నో విడుదల అయ్యి మంచిది సక్సెస్ ను సాధించగా ఇప్పటికి అలాంటి మూవీస్ విడుదల అవుతూనే ఉన్నాయి.
చిన్నారుల చుట్టూ తిరిగే కథతో రూపొందిన సినిమాలు అడపాదడపా వెండితెరపై కాసుల వర్షం కురిపించాయి.
అయితే, ఇటీవల పసివాడి పాత్రలు మళ్లీ బలంగా ప్రాణం పోసుకుంటున్నాయి.ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిన్నారి చుట్టూ కథను నడిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.
ఇంతకీ ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న.
( Hi Nanna ) సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను కదిలించారు.
అమ్మా నాన్నల ప్రేమ కథను కూతురి ద్వారా నడిపించి సరికొత్త ప్రయోగం చేశాడు దర్శకుడు శౌర్యువ్.
తండ్రి, కూతుళ్ల అనుబంధం విజువల్ ఫీస్ట్‌గా ఉండటంతో హాయ్ నాన్న మూవీకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సైంధవ్ సినిమా( Saindhav ) టీజర్‌లో కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం కనిపిస్తోంది.
గన్స్ మాఫియాను వైరిపక్షంగా చూపించినా, టీజర్ ఎండింగ్‌లో తండ్రీ కూతుళ్లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి ఈ సినిమాలో రెండో కోణం ఉందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు శైలేష్.
హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ ఈ చిత్రాన్ని యాక్షన్ కమ్ సెంటిమెంట్‌గా తెరకెక్కించాడని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
"""/" /
అలాగే లోకేశ్ కనకరాజ్, కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఖైదీ.
( Khaidi ) ఇందులో కూడా కూతురు సెంటిమెంట్ అబ్బురపరుస్తుంది.కూతురు ముఖం కూడా చూడకుండానే జైలుకు వెళ్లిన తండ్రి ఏడేండ్ల తర్వాత జైలు నుంచి విడుదల అవుతాడు.
అనాథాశ్రమంలో ఉన్న కూతురిని చూడాలనుకుంటున్న తండ్రి ఊహించని విధంగా ఒక పోలీస్ ఆపరేషన్‌లో భాగం కావాల్సి వస్తుంది.
వరుసగా చేజింగ్ ఎపిసోడ్స్ వస్తున్నా హీరో తన బిడ్డను ఎప్పుడు కలుసుకుంటాడన్న ఆరాటం ప్రేక్షకుల్లో మొదలవుతుంది.
తన బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని పరితపించిన హీరో తెల్లారేదాకా బతికుంటాడో, లేడో అనే స్థితికి చేరుకుంటాడు.
యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుగా కథను నడిపించి ప్రేక్షకులను కట్టిపారేశాడు దర్శకుడు. """/" /
అలాగే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్.
( RRR ) రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన ఈ మాయాజాలం మూలకథ ఒక అడవిబిడ్డను రక్షించడమే.
అలాగే ఎన్టీఆర్,రామ్ చరణ్ వీరిద్దరినీ ఒక్కతాటిపైకి తేవడానికి ఒక చిన్నారి పాత్రను ఎంచుకున్నాడు జక్కన్న.
ఇలా ఈ సినిమా కూడా ఒక చిన్న పాప సెంటిమెంట్ తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అలాగే కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్.( Vikram ) లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రధాన కథ డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడం.
అయితే, దీనికి అనుబంధంగా తాత, మనవడి కథ కనిపిస్తుంది. """/" /
కొడుకును కోల్పోయిన తండ్రిగా, తండ్రిలేని తన మనవడిని కాపాడుకునే తాతగా కమల్ నటన ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది.
అలాగే గత ఏడాది వచ్చిన సర్దార్ సినిమా( Sardar Movie ) కూడా నీటి కాలుష్యం, ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ప్యాకింగ్ వల్ల కలిగే అనర్థాలను ఈ సినిమా కండ్లకు కట్టింది.
ప్రధాన కథకు అనుబంధంగా ఉన్న ఒక పిల్లాడి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.క్యాన్సర్ బాధిత బాలుడు హీరో జర్నీలో కీలకంగా మారుతాడు.
హీరో తండ్రితో స్నేహం చేస్తాడు.హీరో పాత్రను డామినేట్ చేసేంతగా ఆ చిట్టి పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు పీఎస్ మిత్రన్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమా?