అక్కడ నాలుగేళ్లలోపు చిన్నారులకు జాబ్.. వారికి శాలరీగా ఇచ్చేవి ఇవే

ఒకప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు కనిపించేవి.తాతయ్య, బామ్మల ఒళ్లో మనవలు, మనవరాళ్లు ఆడుకునే వారు.

ఎన్నో కథలు చెప్పించుకుని అలాగే నిద్రపోయేవారు.అయితే పరిస్థితులు మారిపోయాయి.

వృద్ధులను వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు.అలాంటి వారు ఎవరూ లేరనే బాధతో కుమిలి పోతుంటారు.

అయితే అలాంటి వృద్ధులకు ఊరట కలిగించేలా దక్షిణ జపాన్‌లోని ఒక నర్సింగ్ హోమ్ కీలక నిర్ణయం తీసుకుంది.

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఉద్యోగాలు కల్పిస్తోంది.వృద్ధులతో గడిపి, వారిలో ఒంటరితనాన్ని దూరం చేయడమే ఇందుకు ముఖ్య ఉద్దేశం.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.జపాన్‌లోని కిటాక్యుషులోని నర్సింగ్ హోమ్‌లో నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

వారు వృద్ధులు ఉండే నర్సింగ్ హోమ్‌ను సందర్శిస్తూ ఉండాలి.వారితో పాటు ఓ కేర్‌టేకర్‌ను కూడా తీసుకు వచ్చే సదుపాయం కల్పించారు.

ఇక చిన్నారులు తమకు ఇష్టమైన సమయంలో అక్కడికి రావొచ్చు.బదులుగా వారికి జీతంగా వేసుకోవడానికి డైపర్లు, తినడానికి ఫుడ్, మిల్క్ పౌడర్ అందజేస్తారు.

80 ఏళ్లు దాటిని 100 మందికి పైగా వృద్ధులు ఆ నర్సింగ్ హోమ్‌లో ఉంటారు.

వారికి సాంత్వన కలిగించేందుకు ప్రస్తుతం 30 మందికి పైగా చిన్నారులతో ఉద్యోగాలకు కాంట్రాక్ట్ కుదిరింది.

ఈ విషయాన్ని నర్సింగ్ హోమ్ హెడ్ కిమీ గోండో చెప్పారు.ఇది చక్కటి ఫలితాలను ఇస్తోందని తెలిపారు.

చాలా మంది వృద్ధుల్లో సంతోషం కనపడుతోందని, ఆ చిన్నారులను తమ సొంత వారిలా చూస్తున్నారని పేర్కొన్నారు.

ఫలితంగా వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని వివరించారు.పిల్లలు తమ తల్లులతోనే ఉంటారని, అయితే పార్క్‌లో వాకింగ్‌కి తీసుకువెళుతున్నట్లుగా వృద్ధులకు కూడా ఓ కుటుంబాన్ని కలిగి ఉన్నట్లు ఉంటుందని గోండో చెప్పారు.

ఆ సినిమా వద్దు అని కారు డ్రైవర్ కూడా ఎన్టీఆర్ ని వారించాడు.. కట్ చేస్తే ..!