అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో … వణికిపోతున్నారే ?

గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏ పరిస్థితులు అయితే నెలకొన్నాయో, ఇప్పుడు అదే పరిస్థితులు టిడిపి ప్రభుత్వంలోను కనిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి టిడిపి నేతలు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టింది లేదు.

టిడిపి నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగినా, అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా, అంతకుముందు టిడిపి ప్రభుత్వంలో కీలకమైన పదవులు అనుభవించిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఎవరూ బయటకు వచ్చి ప్రభుత్వం కు వ్యతిరేకంగా రొడ్డెక్కిన పరిస్థితి కనిపించలేదు.

స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) రంగంలోకి దిగి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా, అంతంతమాత్రంగానే నాయకుల స్పందన ఉండేది.

బయటకు వచ్చి పోరాటాలు చేపట్టిన నాయకులపై అప్పటి వైసిపి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం వంటి కారణాలతో మిగిలిన నాయకులు మనకెందుకు వచ్చింది అన్నట్టుగా ఇళ్లకే పరిమితం అయిపోయారు.

"""/" / అప్పట్లో గెలిచిన 23 మంది టిడిపి ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ కి మద్దతుదారులుగా మారిపోయారు.

మిగిలిన 18 మందిలో ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన నేతలు సైలెంట్ గా ఉన్నారు.

కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా ప్రయత్నాలు చేయలేదు.దీంతో పార్టీ పరిస్థితిని చంద్రబాబు రంగంలోకి దిగి చక్కదిద్దారు.

ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత టిడిపి నేతలు మళ్ళీ యాక్టివ్ అయ్యారు.నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ వైసీపీ( YCP ) ప్రభుత్వం పై పోరాటాలకు దిగారు.

ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో, వైసీపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.వరుసగా వైసిపి కార్యాలయాలను అధికారులు కూలగోడుతున్నా, దానిపై నోరు విప్పేందుకు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారు ఎవరు సాహసం చేయడం లేదు.

"""/" / ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు దిగితే అనవసరంగా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఎన్నికలకు రెండేళ్ల ముందు జనాల్లోకి వచ్చి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తే సరిపోతుందని, ముందు నుంచే ప్రభుత్వం పై పోరాటాలకు దిగినా కేసులు తప్ప, కలిగే ప్రయోజనం ఉండదనే ఆలోచనకు చాలామంది నేతలు వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.

జగన్ తో పాటు , ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారెవరు బయటకి రావడం లేదు .

పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ , వంటి వారు మాత్రమే వైసీపీ కార్యాలయాల కూల్చివేత మరికొన్ని వ్యవహారాలపైన స్పందిస్తున్నారు.

అప్పటి టిడిపి లో పరిస్థితులనే ఇప్పుడు వైసీపీ ఎదుర్కుంటోంది.

స్టార్ డైరెక్టర్లకు షాక్ ఇస్తున్న రామ్ పోతినేని…